జగిత్యాల: భవిషత్ తరాల కోసమే నూతన విద్యుత్ ప్రాజెక్టులు

భవిష్యత్ తరాల కోసమే నూతన విద్యుత్ ప్రాజెక్టులు చేపడుతున్నామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోమవారం జగిత్యాలలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఆర్థికాభివృద్ధి విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. చీరల పంపిణీపై ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని సూచించారు. చీరల పంపిణీ కొనసాగుతున్న కార్యక్రమమని, ప్రజా పాలన ఉత్సవాలను అడ్డుకునే ప్రయత్నాలను ప్రతిపక్షాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

సంబంధిత పోస్ట్