జగిత్యాల: ఆర్టీసీ డిపో మేనేజర్ పై వేటు

జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించినట్లుగా ఒక వీడియో జిల్లాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నాయకుడి ఫిర్యాదుతో అధికారులు తొందరపడి డ్రైవర్‌ను తొలగించారని, అతని చర్య పెద్ద తప్పు కాదని, సస్పెండ్ చేయవద్దని తాను ఆదేశాలు ఇచ్చానని మంత్రి పేర్కొన్నారు. తొందరపడి తొలగింపు ఉత్తర్వులు ఇచ్చిన డిపో మేనేజర్‌ను వేరే డిపోకు బదిలీ చేయాలని కూడా ఆదేశించినట్లు మంత్రి ఆ వీడియోలో తెలిపారు.

సంబంధిత పోస్ట్