జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రామభద్రునిపల్లిలో మంగళవారం రాత్రి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 108 రకాల నైవేద్యాలతో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు గణపయ్యకు ఇష్టమైన వివిధ రకాల వంటకాలను తయారుచేసి నైవేద్యంగా సమర్పించి, అనంతరం వాటిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.