జగిత్యాల: దివ్యాంగ విద్యార్థులను ఆదరించండి

జగిత్యాలలోని భవితా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ, దివ్యాంగ విద్యార్థులను భారంగా భావించకుండా దేవుడిచ్చిన ప్రసాదంగా ఆదరించాలని సూచించారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పాటునందించాలని, ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి ఆనంద్ రావు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్