జగిత్యాల: తెలంగాణ అగ్నిగుండం అవుతుంది: ఎల్. రమణ

జగిత్యాలలో కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లా కేంద్రంలో భారీ నిరసన చేపట్టి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీలు ఎల్. రమణ, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే విచారణ చేపట్టారని ఆరోపిస్తూ, ఇలాంటి చర్యలు కొనసాగితే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్