జగిత్యాల: నిండు జీవితానికి రెండు చుక్కలు

జగిత్యాల జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహిత భారత నిర్మాణంలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ మోతె వాడ పిహెచ్‌సిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశం నుండి పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్