జగిత్యాల: ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్. లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాసవీ మాత జయంతి సందర్భంగా ధర్మం, అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి తెలియజేసిన వాసవీ మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. వాసవీ మాత చూపించిన సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్