జగిత్యాల: తెలంగాణ శక్తి అభియాన్ ఉదృతం చేస్తాం

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ 'తెలంగాణ శక్తి అభియాన్' కార్యక్రమాన్ని గురువారం ప్రకటించింది. రాజకీయ రంగంలో మహిళలకు సముచిత స్థానం కల్పించడమే దీని లక్ష్యం. మహిళల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యం అసంపూర్ణమని, అందుకే రాజకీయాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ సాధించడమే 'శక్తి అభియాన్' ప్రధాన లక్ష్యమని జిల్లా అధ్యక్షులు పొలాస నందయ్య తెలిపారు. మహిళలను కేవలం ఓటర్లుగానే కాకుండా, నిర్ణయాధికారం కలిగిన నాయకులుగా తీర్చిదిద్దాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్