సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, మల్యాల సిఐ, మల్యాల, కొడిమ్యాల ఎస్ఐలను చెక్ పోస్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రశాంత వాతావరణం కోసం ఈ తనిఖీలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.