కొండగట్టు: అంజన్న ఆలయంలో కూలిన చలువ పందిల్లు

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలవ పందిళ్లు బుధవారం తెల్లవారుజామున కూలిపోయాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న నాయి బ్రాహ్మణుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ పందిళ్లను ఏర్పాటు చేశారు. అయితే, అవి అకస్మాత్తుగా కూలిపోవడంతో అధికారులు వాటిని సరిచేసే పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్