జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లిలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన వేలంలో లడ్డూకు రూ.10116 పలికింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అందే నారాయణ- అన్నపూర్ణ దంపతులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. ఈ వేలం కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగింది.