జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామంలో తెలంగాణ శివాజీ సేన జిల్లా అధ్యక్షులు బుస. మధు, BJYM జిల్లా సెక్రటరీగా నూతనంగా నియమితులైన వాకిటి తిరుపతి రెడ్డిలకు గ్రామ యువకులు, గ్రామస్తులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలో యువకులు, గ్రామస్తుల సహకారం, మద్దతు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.