మెట్పల్లి మండలం వేంపేటలో సోమవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన దండె నరసింహులు అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందారు. ధర్మారం గ్రామానికి చెందిన నరసింహులు, వేంపేట శివారులోని వాగులో విద్యుత్ తీగతో చేపలు పడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు గాలించగా రాత్రి వాగు వద్ద విగతజీవిగా కనిపించారు. నరసింహులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.