జగిత్యాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమిపూజ

జగిత్యాల పట్టణంలోని 12, 28, 29, 30 వార్డులలో 53 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు బుధవారం జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ గారు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు, వార్డు నాయకులు, మహిళలు, యువకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ పనుల ద్వారా పట్టణంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్