రాయికల్ లో ఘనంగా మొహరం పండగ, పులివేషాలతో సందడి

జగిత్యాల జిల్లా రాయికల్ లో శనివారం మొహరం పండగను ఘనంగా నిర్వహించారు. భక్తులు పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. యువకులు పులివేషాలు ధరించి, డప్పు, డీజే పాటల మధ్య నృత్యాలు చేస్తూ అలరించారు. ప్రతి సంవత్సరం పులి వేషాలు వేయడం ఇక్కడ ఆనవాయితీ. మహిళలు, వృద్ధులు, పిల్లలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకలను తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్