జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామానికి చెందిన నల్లాల లావణ్య (40) రెండు రోజుల క్రితం మృతి చెందారు. మృతి చెందిన లావణ్య కళ్లను, భర్త తిరుమల్, కుటుంబ సభ్యుల అనుమతితో హైదరాబాదులోని ప్రసాద్ ఐ ల్యాబరేటరీకి వారు దానం చేశారు. లావణ్య మృతి చెందిన బాధ ఒకవైపు వేధిస్తున్నా, ఆమె కళ్ళు సజీవంగా ఉంటాయని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.