జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై పెగడపల్లి ఎస్సై ఈ. కిరణ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.