జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండల కేంద్రంలో మంగళవారం వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించి, వాతావరణాన్ని చల్లబరిచింది.