మల్యాలలోని బీసీ కాలనీలో ఇంటి తాళం పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారని ఎస్సై నరేశ్ తెలిపారు. కాలనీకి చెందిన రుక్సానా ఈ నెల 6న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లారు. 9న తిరిగి రాగా గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడినట్లు గుర్తించారు. తెరచిన బీరువాను పరిశీలించగా 2 తులాల బంగారం, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు తెలుసుకొని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.