జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బుధవారం నిర్వహించే గణపతి నిమజ్జనం వేడుకలను నిర్వాహకులు భద్రతా నియమాలను తప్పని సరిగా పాటించాలని ఎస్ఐ సూచించారు. ఊరేగింపు సందర్భంగా డిజె, పెద్ద శబ్దాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వినియోగించారదన్నారు. మత్తు పదార్థాల వాడకం నిషిద్ధమని, నిమజ్జనం వద్ద చిన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.