ఘనంగా మూల నక్షత్రం పూజలు

జగిత్యాల పట్టణానికి అతి సమీపంలో నూకపెల్లి గ్రామంలోని కొండ పై కోలువై ఉన్న చదువుల తల్లి శ్రీ జ్ఞాన ధ్యాన విజ్ఞాన సరస్వతి దేవాలయంలో ఘనంగా మూల నక్షత్రం పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి హోమం, అక్షరాబ్యాసలు వివిధ పూజలు నిర్వహించారు. తదుపరి విచ్చేసినటువంటి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేతరాజు లక్ష్మీ నరసింహశర్మ మాట్లాడుతూ మూల నక్షత్రం రోజున సరస్వతీ దేవిని పూజించడం, అలాగే మూల నక్షత్ర దోష శాంతి పూజలు చేయడం చాలా ముఖ్యమని సరస్వతీ దేవి మాతను తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలతో (మల్లెలు, తెల్ల తామర) పూజించాలన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕