జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 30న ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రభాకర్రెడ్డి ఆదివారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.