ఈ నెల 2న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో జరిగిన సంగీత ప్రదర్శనలో కొడిమ్యాల మండలం గోపాల్రావుపేటకు చెందిన 7వ తరగతి విద్యార్థి శార్విన్ గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించాడు. 22 దేశాలకు చెందిన 2 వేల మంది కీబోర్డు వాయిద్య కళాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, 777 మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరిలో శార్విన్ కీబోర్డు మ్యూజిక్‌లో రికార్డు సాధించడంతో నిర్వాహకులు అతనికి ధ్రువీకరణ పత్రం అందజేశారు.