తెలుగు భాషా పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ

వెల్గటూర్ మండల తెలుగు భాషా స్థాయి పోటీల్లో విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. సీనియర్స్ విభాగంలో వెల్గటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని P. సాత్విక ప్రథమ బహుమతి, కుమ్మరిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని M. వర్షిణి ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. జూనియర్స్ విభాగంలో పైడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని G. రష్మిత ప్రథమ, స్తంభంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని L. దీప్తి ద్వితీయ బహుమతులు పొందారు. విజేతలకు మండల విద్యాధికారి ప్రభాకర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సందీప్ రాజు, వర్షిణిని అభినందించారు.

సంబంధిత పోస్ట్