జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి, వెంగళాయిపేట, నంచర్ల, దేవికొండ, రాములపల్లి గ్రామాలలో 229 నుండి 240 వరకు గల పోలింగ్ కేంద్రాలలో బిఎల్‌ఓలతో ఎలక్టోరల్ ఫారాల (EFs) పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను తహశీల్దార్ నిజామోద్దీన్ ఆదివారం పరిశీలించారు. సర్ (SIR-2026) ను పకడ్బందీగా చేపట్టాలని, ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.