జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధులు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్ పాల్గొని, వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు వల్లెపు మొగిలి, వడ్డెర నాయకులు, సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.