సర్పంచ్ పదవికి వేలం వేసిన వీడీసీలు!

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో సర్పంచ్ పదవికి బీసీ రిజర్వేషన్ వచ్చినా, గ్రామ వీడీసీలు ఓసీలకు సమాచారం ఇవ్వకుండానే వేలం పాట నిర్వహించారని, దీనిని అడ్డుకున్నందుకు తమను గ్రామ బహిష్కరణ చేశారని కొందరు గ్రామస్తులు ఆరోపించారు. మంగళవారం ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు కూడా వేలం పాటలు నిర్వహిస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరగా, తమను బహిష్కరించారని బాధితులు మెట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరాణా, వైద్య, మీసేవ వంటి సేవలు నిలిపివేసి, వేలం డబ్బులు కూడా అందకుండా చేశారని ఆరోపించారు. వరద కాలువ కోసం మిగిలిన ప్రభుత్వ భూమిని వీడీసీలు పంచుకుంటున్నారని ప్రశ్నించినందుకు కూడా వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బాధితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్