జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామపూర్ జడ్పి ఉన్నత పాఠశాలలో శుక్రవారం కిచెన్ షెడ్డు, టాయిలెట్స్ నిర్మాణ పనులను సర్పంచ్ చిర్ర రజిత-రమణాకర్, ఎంపిడివో ప్రేమ్ సాగర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ సులోచన, ఉప సర్పంచ్ విష్ణు, పంచాయతీ కార్యదర్శి లావణ్య, మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సంతోష్ పాల్గొన్నారు.