మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ ఆదేశాలతో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణంలోని 26 వ వార్డులో ఆదివారం తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి ప్రజలకు అవగాహన చేయడమైనది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మీ ఇంటి నుండి వచ్చే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు చేసి మున్సిపల్ ఆటోలకు అందివ్వాలని తెలిపినారు. తడి చెత్తను కంపోస్ట్ సెంటర్ కు తరలించి ఎరువుగా తయారు చేయటం జరుగుతుందని, పొడి చెత్తను డిఆర్సిసి సెంటర్ కు తరలిస్తామని తెలపడం జరిగింది.