చెర్లకొండాపూర్ అక్కాచెల్లెళ్ల అద్భుత ప్రతిభ: ఇంటర్, ఎస్ఎస్‌సీలో సత్తా చాటారు

జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం చెర్లకొండాపూర్ గ్రామానికి చెందిన పటేరి రిషిక, పటేరి సంకీర్తన అనే అక్కాచెల్లెళ్లు తమ విద్యాభ్యాసంలో అద్భుత ప్రతిభ కనబరిచి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అక్క పటేరి రిషిక 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించగా, తాజాగా ప్రకటించిన ఎస్ఎస్‌సీ ఫలితాల్లో చెల్లి పటేరి సంకీర్తన 600 మార్కులకు గాను 573 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బాసా లాస్య ఆనంద్ అక్కాచెల్లెళ్లను అభినందించి, వారి భవిష్యత్తుకు ఆకాంక్షించారు. ఈ విజయంతో చెర్లకొండాపూర్ గ్రామం విద్యా రంగంలో మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది.

సంబంధిత పోస్ట్