జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో బుధవారం, వన మహోత్సవం సందర్భంగా 7, 16, 26 వార్డులలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, పట్టణాన్ని హరితమయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, సంరక్షించాలని, పచ్చదనం పెరగడం వల్ల స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని, ప్రజల భాగస్వామ్యంతోనే హరిత మెట్‌పల్లి సాధ్యమవుతుందని చైర్మన్ లింబాద్రి పిలుపునిచ్చారు.