జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ మున్సిపల్ పరిధిలో శనివారం వట్టి వాగు వద్ద గణపతి నిమజ్జన వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి సత్యప్రసాద్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 23, 24 నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డిఎస్పీ ఏ. రాములు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్, నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, ఆర్డిఓ ఎమ్మార్వో ఇతర అధికారులు పాల్గొన్నారు.