జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్ పల్లి ఆర్డీవో ఆఫీసు ముందు రాఘవపేట, నడికుడ గ్రామాల రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. గుడ్డనుగుల గుట్ట ప్రాంతంలోని రెవెన్యూ భూమిని ఏళ్ల తరబడి పశువుల మేతకు వాడుకుంటుండగా, నడికుడ గ్రామానికి చెందిన వ్యక్తి తనకు పట్టా ఉందని ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని రైతులు వ్యతిరేకించారు. భూ సర్వే రద్దు చేసి, ప్రభుత్వ భూమిని కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. అనంతరం ఆర్డీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.