ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని బాలకిషన్ నగర్ కాలనీ వినాయక మండపం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. ప్రత్యేక పూజలు అనంతరం కాలనీ మహిళలు కుంకుమ పూజలలో పాల్గొన్నారు. వేద పండితులకు దక్షిణ సమర్పించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ తోట ప్రసాద్, కాలనీ అధ్యక్షులు తోట ప్రవీణ్, ఉపాధ్యక్షులు సాంబార్ శ్రీనివాస్, కార్యదర్శి చందనగిరి రమేష్, నాగేశ్వర్, గిరి పర్రే మిల్ట్రీ శంకర్, మర్రి మహేష్,  కోరే రమేష్, బోయిని ప్రవీణ్, సురేష్, కాలనీ మహిళ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕