ఇబ్రహీంపట్నం మండలంలోని యామపుర్ గ్రామంలో శుక్రవారం విద్యుత్ శాఖ అదికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విధ్యుత్ శాఖ ఇంజనీర్ సతీష్, అధికారులు రైతులను పంట పొలాల్లోనే కలిసి వారి సమస్యలు తెలుసుకొన్నారు. ఎఓ మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ లపై ఫ్యూజ్ లు పోయినపుడు సంబంధిత సిబ్బందికి సమాచారం అందిస్తే సరిచేస్తారని, కానీ తమకు తాముగా వేసుకొనే ప్రయత్నం చేసి ప్రమాదాల బారిన పడవద్దని తెలిపారు.