ఇబ్రహీంపట్నం: మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన తహసీల్దార్

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోదురు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్ వరప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి పాఠశాలలోని మౌలిక వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్