జగిత్యాల జిల్లా అంబారిపేట సబ్స్టేషన్లో గతంలో ఉన్న 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో అధిక సామర్థ్యం కలిగిన 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి ఛార్జింగ్ చేసినట్లు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ బి. సుదర్శనం తెలిపారు. భవిష్యత్తులో పెరిగే విద్యుత్ లోడును దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు, రైతులకు ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డివిజనల్ ఇంజనీర్ మధుసూదన్, డివిజనల్ ఇంజనీర్, సేఫ్టీ ఆఫీసర్ గంగారం, ఏడీఈ రఘుపతి, ఏఈ అశోక్, సబ్ ఇంజనీర్ భరత్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.