జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో గురువారం చింతల నాగభూషణం తండ్రి రాజారాం అక్షరాల ఒక లక్ష ఒక వెయ్యి పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చి శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణంలో మహారాజ పోషకులుగా సభ్యత్వం తీసుకోవడం జరిగింది. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ద్యావనపెల్లి రాజారాం మాట్లాడుతూ వీరికి, వీరి కుటుంబ సభ్యులకు శివభక్త మార్కండేయ శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం అని అన్నారు.