జగిత్యాల: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు, స్థానికులతో కలిసి సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నుండి రూ. 9.20 లక్షల నిధులతో రెండు భాగాలుగా రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సున్నం సత్యం, మాజీ ఉపసర్పంచ్ అసతి పెద్దరాజం, తరి రామనుజం, కోత్తురి సుదకర్, దాసరి రంజిత్, అసతి నడ్పి రాజం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్