జగిత్యాల: గంగపుత్ర సంఘాలకు ప్రొసీడింగ్ పత్రాల అందజేత

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ప్రోసీడింగ్ పత్రాలను బీజేపీ మండల అధ్యక్షుడు బాయి లింగరెడ్డి సోమవారం అందజేశారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి నిధుల నుండి ఈ మొత్తం మంజూరైంది. త్వరలో మరిన్ని నిధులు మంజూరు చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్టు లింగరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్