జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, గురంవారం మండలానికి చెందిన పేదలకు సీఎం సహాయ నిధి (CMRF) ద్వారా వచ్చిన చెక్కులను కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు స్థానిక నేతలతో కలిసి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అత్యవసర చికిత్స కోసం ఈ నిధి పేదలకు ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.