కోరుట్ల పట్టణంలోని అతి పురాతన దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోగురువారం గురు పౌర్ణమి పురస్కరించుకొని గరుడ సేవ నిర్వహించారు. సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి మంగళహారలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ నరసయ్య, చైర్మన్ ఎతిరజం నర్సయ్య, ధర్మకర్తలు నేతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.