కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బుధవారం పరిశీలించారు. గత నాలుగు వారాలుగా మొక్కజొన్న కొనుగోలులో జరుగుతున్న తీవ్ర జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మార్క్‌ఫెడ్ డీఎంకు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆదేశించారు.