కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు

జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బుధవారం పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోరుట్లలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల, మొహన్‌రావుపేట జడ్పీహెచ్‌ఎస్, మధాపూర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదుల పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధన విధానంపై ఆరా తీశారు. మధాపూర్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్