జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో బుధవారం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ, కోరుట్ల నియోజకవర్గ ప్రజలపై తల్లి చల్లని చూపు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.