సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జువ్వాడి రత్నాకరరావు జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ జాతరలో మంత్రి పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు.