కోరుట్ల: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

తుఫాను ప్రభావంతో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలో ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆయన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, డిఎస్ఓ జితేందర్ రెడ్డి, ఎమ్మార్వో కూడా ఆయనతో పాటు ఉన్నారు.

సంబంధిత పోస్ట్