కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో శుక్రవారం రోజున శ్రీరామ్ యూత్, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారతరత్న, స్వాతంత్ర సమర యోధులు, భారత 2వ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నీలి శ్రీనివాస్, ఉత్కం శ్రీనివాస్, మారుతి, శ్రీధర్, శేఖర్, శివ మహేష్ రాకేష్, శ్రీకర్, శ్రీనివాస్, శేఖర్ పాల్గొన్నారు.