మాజీమంత్రి జయంతి.. నివాళులర్పించిన నాయకులు

మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావు జయంతి సందర్భంగా పాతదామరాజపల్లి గ్రామంలో ఆయన చిత్రపటానికి సర్పంచ్ రాజేశ్వరి-రాజరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రిగా, బుగ్గారం ఎమ్మెల్యేగా రత్నాకర్ రావు ప్రజలకు చేసిన నిస్వార్థ సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕