అటవీ సంపద రక్షణ ప్రతి ఒక్కరి భాధ్యతగా తీసుకోవాలని మెట్‌పల్లి అటవీశాఖ రేంజర్ పద్మరావు అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో అటవీశాఖ అధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజర్ పద్మరావు మాట్లాడుతూ అడవు విస్తారంగా పెరుతున్నాయని వాటి సంరక్షణలో అటవీశాఖ అధికారులతో పాటు గ్రామస్తులు భాధ్యత తీసుకోవాలన్నారు.